విరిగిన ఎముకలకు ‘నల్లేరు’ అతుకు


ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే నల్లేరు పొద జాతికి చెందినది. మంచి ఔషధ గుణాలు కలిగినవి నల్లేరుకాడలు. వీటిని కూరగాయల వలే వంటకాల్లో కూడా గిరిజనులు ఉపయోగిస్తారు. నలుపలకలుగా ఉండి తీగలా తాటిచెట్లు, మర్రిచెట్టు, రావిచెట్టు వంటి భారీ వృక్షాలపైకి ఎగబాకే ఈ నల్లేరు వల్ల విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. ఎముకలు బలపడతాయి. చెవిపోటు, అజీర్ణం వంటి వ్యాధులకు మంచిమందు.

కాల్షియం ఆగ్జలేటు, కెరొటిన్, ఆస్కార్బిక్ ఆమ్లం, ఆల్ఫా ఎమిరిన్, బీటా సైటోస్టీరాల్, విటమిన్ సి రసాయనాలు కలిగి ఆస్థిసంఘాల్ తైలం, వలియ చించాది లేహ్యం, పాధ్య పునర్నివారి కషాయం వంటి ఆయుర్వేద మందులలో నల్లేరు మొక్కను పూర్తిగా ఉపయోగిస్తారు. ఆస్థసందాన్, అస్థిసంహారీ అని వైద్యులు పిలిచే నల్లేరును శాస్త్రీయంగా సిస్సస్క్వడ్రాన్ గ్యులారిస్ లిన్నేయస్ అని పిలుస్తారు. వైటేసి కుటుంబానికి చెందిన ఈ నల్లేరు గిరిజనులకు బాగా తెలుస్తుంది.

నల్లేరు లేత కొమ్మలను ఎండబెట్టి పొడి చేసుకుని అజీర్ణం తగ్గడానికి, ఆకలి పెరగడానికి ఉపయోగించవచ్చు. అలాగే వేర్లను పొడిచేసి తింటే విరిగిన ఎముకలు అతుక్కోవడానికి సహకరిస్తుంది. చెవిపోటు, చెవిలోంచి చీముకారడం వంటి వ్యాధులు తగ్గుతాయి. ఎముకలు విరిగినప్పుడు కాండం రసాన్ని తీసి టానిక్కులా వాడుతూ ఎప్పటికప్పుడు గాయమైనచోట కాండంతో తయారుచేసిన పేస్టును పూస్తే గాయం తగ్గుముఖం పడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.