వేపలో క్రిములను నాశనం చేసే గుణముంది. ‘పీచు’ అనే ఒకరకమైన కుష్టువ్యాధిని నివారిస్తుంది. గ్రామ దేవతలకు వేపాకు ఎంతో ప్రియమైనది. పిల్లలకు అమ్మవారు పోసినప్పుడు వేపాకుతో దండలు వేయడం, వారు పడుకున్న మంచానికి కట్టడం వంటివి చేయడం మన సనాతన ఆచారం.
వేపచెట్టు నీడలో కూర్చుంటే ఎంతటి అలసట నుంచయినా సేదతీరి మనస్సుకు ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది.
షుగరు వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున లేత వేప చిగురును కొద్దిగా కోసి తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
వేపాకును మనం స్నానం చేసే వేడి నీటిలో వేసుకుని కాచుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేపాకును ముద్దగా నూరి, సున్నిపిండితో కలిపి ఒంటికి పట్టించి కాసేపుంచి స్నానం చేస్తే చర్మరోగాలు ఉంటే పోతాయి.

వేప చేదుగా ఉన్నా, పళ్ళు కొంత చేదు, తీపి కలగలిసి తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. చిలుకలు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. అందుకే వేపచెట్టును శీనప్రియ అంటారు. వేపచెట్టు కల్పవృక్షం లాంటిది. వేసవి ప్రారంభానికి ముందు వేపాకులను, వేప పువ్వును వేయించి పొడి చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని అన్నంలో కలుపుకుని తింటే శరీరం శుభ్రపడి, వేసవి తీవ్రతను భరించడానికి అనువుగా తయారవుతుందని చాలామంది పెద్దలు చెబుతారు.
వేపచెట్టు లోపలి బెరడులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. వేప పుల్లతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. పుస్తకాల్లో వేపాకులు ఉంచితే పుస్తకాలు చెదలు పట్టకుండా ఉంటాయి. అందుకే మన పూర్వీకులు వేపలోని క్రిమి సంహార లక్షణాన్ని ఏనాడో గుర్తించారు.
బియ్యం బస్తాల్లో వేపాకులు ఉంచితే పురుగు పట్టకుండా చూస్తాయి. వేప విత్తనాల నుండి తీసిన నూనె అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వేప జిగురును పట్టు, కాటన్ దారాల్ని గట్టిపరచడానికి ఉపయోగిస్తారు. సబ్బుల పరిశ్రమల్లోను, మొక్కలకు పట్టే చీడలను నివారించడంలోను ఉపయోగిస్తారు.
వేపను మన దైనందిన జీవితంలో చేర్చి వాడితే ఆహారంగా, వైద్యంగా ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉండే వేపని మనం చక్కగా ఉపయోగించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలి.