ఆకులను విరిస్తే చిక్కని తేనె లాంటి తెల్లని రసం వస్తుంది. ఈ మొక్క ఆకులలోని రసం, వైద్య పరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను కుమారీ ఆవసం, కుమారీవటి, రజ ప్రవర్తనా వటి, కుమారి పాక, చందనాది తైలం, అన్నభేటి, సింధూరం, మంజిష్టాది తైలం వంటి ఆయుర్వేదమందుల తయారీలో ఉపయోగిస్తారు.
పత్రాలు విరిచిన వెంటనే అధికంగా స్రవించే రసం, అజీర్ణం, గ్యాస్టిక్ ట్రబుల్ష్, రక్తశుద్ధిలకు ఉపయోగపడుతుండగా, జీర్ణశక్తిని పెంపొందించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
గ్రంధుల వాపులు, ప్లీహ, కాలేయ కామెర్ల వ్యాధుల నివారణకు ఆయుర్వేదవైద్యంలో ఉపయోగపడతాయి. పత్రరసం లైంగిక శక్తి వద్ధికి ఉపయోగపడుతుంది.
ఇంకా ఆకులను గుజ్జుగా చేసి తేనెతో కలిపి వేపిన ఇంగువతో పాటు కడుపులోకి తీసుకుంటే హిస్టీరియా వ్యాధి నియమవుతుంది. ఈ పత్రాల గుజ్జు నారపుండు పురుగును చంపడానికి, వాపులు, నొప్పులకు వేడిచేసి ఉపయోగించవచ్చు.
ఇంకా శరీరంలోని వేడిని తగ్గించడానికి పంచదార మిశ్రమంతో కలిపి పత్రాల గుజ్జును తీసుకోవచ్చు. తలపోటు తగ్గడానికి నల్లమందుతో కలిపి నూరి పట్టువేయాలి.
ఈ విధంగా కలబంద, వివిధ రోగాలకు ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో అలోయిన్, అల్పోయోడిన్, బార్బలోయిన్, అంత్రాక్వినోన్, ఎమోడిన్ వంటి రసాయన పదార్ధాలున్నాయి. పత్రాలలోని రసం ఎండబెట్టగా ముసాంబరం అనే పదార్ధం లభిస్తుంది. దీనిని వైద్య విధానంలో విరివిగా వాడతారు.