గంధపిరోజా కంఠస్వరం మెరుగుపరిచేందుకు మంచి మందు

సరళన్రావ, శ్రీవాస అని సంస్కృతంలో పేర్లు కలిగిన  గంధపిరోజా సరళదేవదారు చెక్క జిగురు. ఇది పసుపుపచ్చ, ఆకుపచ్చ కలిసిన రంగులో ఉంటుంది. ఈ చెట్టంతయును గుంపులు లేక సరళముగా ఉంటుంది. ఆకులు నువ్వు ఆకులను పోలి చమురు కలిగి చెట్టునకు గంటు పెడితే పాలు కారుతుంది. సాంబ్రాణి వలె ఇది కూడా పొగ సువాసన కలిగి ఉంటుంది. చిన్న బీరకాయల వంటి గదులు కలిగిన కాయలుండును. దీనిని ఇంగ్లీషులో Galbanum or Gandha Biroza అని పిలుస్తారు. 

గంధపిరోజా(Galbanum or Gandha Biroza) గుణములు

  • గంధపిరోజా చేదు, వగరును గల రుచి కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. విపాకమున తీపి రుచిగా మారుతుంది. సరళగుణము, కఫదోషమును తగ్గించును. వాతశమనము, నేత్రదోషమును, శిరోరోగములను, దుర్వాసనను హరించును. 
  • పేను కొరుకుట, దురదలు, వ్రణములు, యోని దోషములు శపింపచేస్తుంది. 
  • కడుపు ఉబ్బరము, అజీర్ణ దోషమును తగ్గిస్తుంది.
  • కంఠస్వరమును బాగుచేస్తుంది. 
  • వీర్యవృద్ధి, కాంతిప్రదము, గ్రహపీడలను తొలగిస్తుంది.

గంధపిరోజాతో  ఔషధములు

అడ్డగఱ్ఱలు, శెగగడ్డలకు

ఒకటి రెండు చిన్నములు యెర్రపాషాణము గంధ ఫిరోజాలో కలిపి పైన పట్టువేసినట్లయితే అడ్డగర్రలు, శెగగడ్డలు హరిస్తాయి. మానని దెబ్బవాపులు కూడా శమిస్తాయి.

సెగలకు

మఱ్ఱిపాలు అరతులము, గంధపిరోజా 5 చిన్నములు రెండూ కలిపి లోనికి సేవించినట్లయితే సెగలు కడతాయి. మరియు వీటిని ఆవునేతితో కఱిగించి మర్దనా చేసినట్లయితే వాతనొప్పులు ఉపశమిస్తాయని వస్తుగుణప్రకాశిక గ్రంథం వివరిస్తోంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.