సింధూర- సంధ్యారుణ-నాగజ అని సంస్కృతంలో పేర్లు కలిగిన గంగ సింధూరము ఎర్రగా ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో Red Oxide of Lead or Vermillion అని పిలుస్తారు. దీనిలో అపరిశుభ్రమైన సీసము ఉంటుంది. కావున విషతుల్యమైనది. ఈ గంగసింధూరమును బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
గంగ సింధూరము గుణములు
వగరు, చేదు రుచులు కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము, చర్మరోగములు అన్నియు హరిస్తుంది. వ్రణము, కుష్ఠరోగము, విసర్పి మొదలైన రక్తదోష జనితమైన రోగములను కూడా హరిస్తుంది.
గంగసింధూరముతో వైద్యం
కొబ్బరినూనెలో తేనె, మైనము కరిగించి అందులో సింధూరము చేర్చి చల్లారిన తరువాత పైన పూత పూసినట్లయితే కురుపులు, గజ్జి, పామా, నరుకు దెబ్బలు హరిస్తాయి. కేవలం గంగసింధూరము తైలములతో కలిపి రాసినా చర్మరోగములు పోతాయి. ఇది లోనికి మాత్రం తీసుకోకూడదు.