గోరోచన Bliary Calculvs of Cow or Ox. ఆవు యొక్క పిత్తకోశమందలి రసము లేక చేదునే గోరోజనమని పిలుస్తారు. ఇది కొంచెం పసుపుపచ్చగా ఉంటుంది.
గోరోజనము గుణములు
గోరోజనము రుచి చేదు. శీతవీర్యము, విపాకమున కారపురుచి, రూక్షగుణము. శ్వాసకాసలను హరిస్తుంది. గ్రహబాధలను తొలగిస్తుంది. గర్భస్రావమును ఆపుతుంది. శుభప్రదమైనది. వశ్యకరమైనది. లక్ష్మీప్రదమైనది. పూజాదికాలలో కూడా విశేషంగా వినియోగిస్తారు.
గోరోజనము ఉపయోగములు
చంటిపిల్లల జలుబు, జ్వరములకు
చనుబాలలో గాని, జీలకఱ్ఱ రసములో గాని గోరోజనము అరగదీసి నాకించినట్లయితే జ్వరములు కడతాయి.
పాము, తేలు విషమునకు
గోరోజనము, పసుపు తెల్లగరిక రసంతో గాని, జామ చెక్క రసముతో గాని కలిపి పైన రాసి గుడ్డపొగ వేసినట్లయితే విషము దిగుతుంది.
కలరాకు
మిరియాలు, జీలకఱ్ఱ కలిపి రసము తీసి ఆ రసముతో గోరోజనము లోనికి ఇచ్చినట్లయితే కలరా రోగము కడుతుంది.
తలనొప్పులకు
గోరోజనము ఆవునేతిలో రంగరించి ఆరు చుక్కలు సస్యము చేయించినట్లయితే తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు కడతాయి.
నరముల బలహీనతకు
గోరోచనము ఆవునేతిలో కరగించి మర్దనా చేసినట్లయితే నరముల బలహీనత తగ్గుతుందని వస్తుగుణ ప్రకాశిక గ్రంథంలో వివరింపబడింది.
అయితే ఎన్నో ఉపయోగాలున్న శుద్ధమైన గోరోజనము లభించడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.