చామంతి చెట్టుపుష్పజాతులలో ఒకటి. అందమైన సువాసన గలిగిన పుష్పములు కలిగినది. ఈ చామంతిలో పలు రకాలు ఉన్నాయి. చిట్టిచామంతి, బిళ్ళచామంతి, పెద్ద చామంతి అనేక రంగులలోకూడా ఉంటాయి. ఈ చెట్టు పూర్తిగా ఒక విధమైన సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వులు అలంకారమునకు, పూజలకు మాత్రమే కాక మందుల తయారీలో కూడా ఉపకరిస్తాయి. ఈ చెట్టులోని అన్నిభాగాలను మందుల కోసం వినియోగిస్తారు.
చామంతి చెట్టుగుణములు
- ఇది చేదు, కారము, వగరు రుచులు కలిగి ఉంటుంది. శిరోవ్యధలను తగ్గిస్తుంది. పైత్య తాపమును, కుష్ఠమును, జ్వరమును తగ్గిస్తుంది. నోటిపూతలను తగ్గిస్తుంది.
- చామంతి ఆకు చేతితో వెచ్చచేసి, కట్టుకట్టినా లేక కాపడము పెట్టినా లేక ఆకు రసము లోనికి తీసుకునట్లయితే తలత్రిప్పుట తగ్గుతుంది.
- చామంతి ఆకు కషాయము పెట్టి ఉదయము, సాయంత్రం సేవిస్తూ ఉన్నట్లయితే మూత్రము సాఫీగా జారీ అగును. అయితే కొంత విరోచనకారి.
- ఎర్ర చామంతిపూల రసము గాని, వేరు గంధము గాని తేలు కుట్టినచోట రాసి గుడ్డతో పొగ వేసినట్లయితే విషము హరిస్తుంది.
- ఎర్రచామంతిపూల కషాయముతో వ్రణములను కడిగినట్లయితే త్వరగా మాను పడతాయి. చామంతి రకములన్నీ ఇంచుమించు ఒకే రకమైన గుణములు కలిగిఉంటాయి.