చుక్కకూర ఉపయోగాలు
పులుపు రుచిగలది. వేడిచేయును. రూక్షగుణము. విపాకమున పులుపురుచిగానే ఉంటుంది. విషహరద్రవ్యము. మూల వ్యాధులను, గుల్మములను తగ్గించును. వాంతులను అరికడుతుంది. కడుపులో మంటలు తగ్గును. అరుచి, గ్రహిణి రోగములను శమింపచేస్తుంది. ఆకు వెచ్చజేసి రసము చెవిలో పిండినట్లయితే చెవిపోటు తగ్గుతుంది. స్రావములు అరికడుతుంది. వాతమును, శ్లేష్మమును పెంపొందిస్తుంది. వీర్యవృద్ధిని కలుగచేస్తుంది.