మేధికావస్తికగా పిలుచుకునే మొంతి శాస్త్రీయనామం Trigonella Feoenum graecum. మెంతి చెట్టు కంతటికి ఒక విధమగు సువాసన ఉంటుంది. ఆకు మరువము ఆకువలె చిన్నదిగా, గుండ్రముగా ఉంటుంది. ఇది మొక్కజాతిలోనిది. దీని కాయలు సన్నగా, కోలగా ఉంటాయి. కాయ ముదిరితే అందులో గోధుమరంగులో, గట్టిగా ఉన్న గింజలు ఉంటాయి. దీని లేత కూరను కూరవండుకుని తింటారు. దీని గింజలనే మెంతులు అంటారు.
మెంతుల గుణములు
మెంతి, కారపు రుచి కలది. వేడిచేసే స్వభావము కలది. రక్త పైత్యమును ప్రకోపింపచేస్తుంది. అరోచకమును తగ్గిస్తుంది. దీపనకారి, వాతహరద్రవ్యము. వాత ప్రధాన ద్రవ్యము. శ్లేష్మమును హరిస్తుంది. జ్వరహరము, బలకరమైనది. కారపు రుచి, చేదురుచి కూడా కలిగి ఉంటుంది.
స్త్రీలలో రుతుక్రమంలో వచ్చే రక్తాన్ని చక్కగా నడిచేలా చేస్తుంది. అధిక రక్త స్రావాన్ని అరికడుతుంది. కాబట్టి మెంతుల్ని తరచూ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, గర్భాశయాన్నికూడా శుభ్రపరుస్తుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు మెంతుల్ని నేరుగా నోట్లో వేసుకుని నమలకుండా నీళ్ళుపోసుకుని మింగడం మంచిదంటున్నారు వైద్యులు.
మెంతులు ఉపయోగాలు
ప్రతి రోజు కనీసం 20 గ్రాముల మెంతుల్ని రెండు మూడు పర్యాయాలుగా తీసుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలిపారు. మెంతి పెరుగు, మెంతి మజ్జిగ, మెంతులతో అట్లు, మెంతుల్ని వేయించి, చిక్కటి కషాయం తీసి వడగట్టి అందులో పాలు కలుపుకుని టీ లాగా వేడి చేసుకుని తాగాలి. రాత్రి నీళ్లల్లో నానబెట్టి మరుసటి ఉదయం తినడం వలన అమీబియాసిస్ వ్యాధిలో జిగట విరేచనాలు తగ్గుతాయి.
మధుమేహ రోగులకు మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరకడపున మెంతుల చూర్ణం లేదా మెంతులు నీళ్ళతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులతోపాటు మధుమేహ వ్యాధి అదుపులోవుంటుంది. వీటితోపాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.
శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకకాల పదార్థాలు తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం తెలియదు. వీటి ప్రభావాలు శాస్త్రీయంగానూ రుజువు కాలేదు. కానీ ఈ విషయంలో మెంతులు కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం.
కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. మెంతుల్లో సాపోనిన్స్ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్ వంటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన.
వేడి నీళ్లలో మెంతులు, వాము, నలజీలకర్ర పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు..కేవలం బరువు తగ్గడమే కాదు...జుట్టు పెరుగుదల,గుండె సంబందిత వ్యాదులు,మలబద్దకం ఇలా అనేక సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఈ పొడి పని చేస్తుంది. బరువు తగ్గడానికి మెంతి-వాము-జీలకర్ర పొడి గ్రేట్ గా సహాయపడుతుంది. మెంతులు, జీలకర్ర కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దాంతో ఎఫెక్టివ్ గా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇక నల్ల జీలకర్రను కాలీ జీర అనికూడా పిలుస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో క్రమంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మెంతులు, వాము, జీలకర్ర తో బరువు తగ్గే ఔషధం తయారీ ఇలా...
250 గ్రాముల మెంతులు * 100 గ్రాముల వాము * 50 గ్రాముల నల్ల జిలకర్ర ముందుగా 3 పదార్థాలను వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత మెంతులు, వాము, నల్ల జిలకర కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఈ పొడికి కొద్దిగా అల్లంపొడి, ఇంగువ పొడి కూడా వేసి మిక్స్ చేసి నిల్వ చేసుకోవచ్చురోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ పొడిని కలిపి తాగాలి. తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.. అలాగే రాత్రి తాగలేని వారు ఉదయం గోరువెచ్చని నీటిలో పరగడుపున తాగాలి. లేదా భోజనం తర్వాత కూడా తాగవచ్చు. అయితే ఆ తర్వాత మరే ఆహారం తీసుకోకూడదు.
ఈ పొడిని పెరుగుతో కూడా తీసుకోవచ్చు. పెరుగన్నంకు కొద్దిగా ఈ పొడి చేర్చి, తీసుకోవాలి. ఇది రుచిని పెంచుతుంది. అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బట్టర్ మిల్క్ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ముఖ్యంగా వేసవిలో వీటిని ఎక్కువ తాగుతారు. మజ్జిగకకు ఈ పొడి చేర్చి తీసుకోవడం ల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వస్తాయి. క్రమం తప్పకుండా 40-50 రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. 3నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు ఉండదు. కంటి చూపు మెరుగవడమే కాదు.. పళ్లు చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. గతంలో తీసుకున్న ఇంగ్లిష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఇది క్లియర్ చేస్తుంది.జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మల బద్దకం శాశ్వతంగా దూరమవుతుంది. మోషన్ సాఫీగా అవుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. దీర్ఘ కాలికంగా దగ్గుతో సతమతమవుతున్నారికి ఇది చక్కటి ఔషదంగా పనిచేస్తుంది.దీనిని రోజూ రాత్రి పూట తాగినట్టయితే దగ్గు పోతుంది. షుగర్ నియంత్రణలోకి వస్తుంది. దీని ఫలితాలను గమనించిన వాళ్లు ఈ పొడిని కంటిన్యూ చేయలనుకుంటే మూడునెలలకొకసారి పదిహేను రోజుల గ్యాప్ తో మళ్లీ తాగడం స్టార్ట్ చేయోచ్చు. మెంతి-వాము-జీలకర్ర పొడి లాభాలు గ్యాప్ లేకుండా 3 నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాల కోసం మళ్లీ వాడాలనుకుంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3నెలలు వాడుకోవచ్చు.