చర్మ వ్యాధులకు, మలేరియాకు మందు ‘నేలవేము’



ప్రకృతి సంపదకు మన దేశంలో కొదవ లేదు. పచ్చని పర్యావరణంతో కళ కళ లాడే మన పల్లెల్లో అడుగడుగునా విలువైన వృక్ష సంపత్తి తారస పడుతూనే ఉంటుది. అందులో వందలాది రకాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించగలవనేది మనకు తెలీని విషయం. ఏజెన్సీ అటవీ ప్రాంతంలోను, బీడు భూముల్లోను మొలిచే నేలవేము అని పిలిచే మొక్క బ్యాక్టీరియా వంటి క్రిమి సంహారిణి గాను, చర్మ వ్యాధులకు, కడుపు నొప్పులకు ఉపయోగపడుతుందని పరిశోధనల్లో వెల్లడయింది. ఈ మొక్క సంవత్సరం పొడవునా పెరుగుతుంది. ఇంచుమించు పూర్తిగా వైద్యానికి పనికివస్తుంది. దీనిలో కాల్మెగిన్, ఆండ్రోగ్రాఫోలిడ్ రసాయనాలు ఉన్నాయి.

ఈ నేలవేము మొక్క కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తుంది. మలేరియా నివారణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిని తగ్గించే గుణాలు ఈ మందులో ఉన్నాయి. ఈ మొక్క అన్ని రకాల జ్వరాలను తగ్గించగలదు. మొక్కను ఎండబెట్టి పొడిచేసి మిరియాల పొడితో కలిపి లోనికి తీసుకుంటే మలేరియా తగ్గుతుంది. పచ్చి ఆకులను వాముతో కలిపి తింటే జీర్ణ సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఈ మొక్క ఆకులను ఇతర వనమూలికా రకాలైన నల్ల ఈశ్వరి మూలిక ఆకులతో సమపాళ్ళలో కలిపి తింటే బలానికి ఉపయోగపడుతుంది.

దీర్ఘకాలిక చికిత్సగా ఈ పద్ధతి చేపట్టాలి. ఆకుల రసాన్ని యాలకులు, లవంగాలతో కలిపి అజీర్ణం, గాస్టిక్ పెయిన్స్, నీళ్ళ విరేచనాలు వంటివి తగ్గించడానికి తీసుకోవచ్చు. మలేరియా వ్యాధి నివారణ కోసం ఈ మొక్కను ఉపయగించి చేసిన కిరాత అనే మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. వైరెస్ వ్యాధులకు మొక్కతో చేసిన టైప్రాలి అనే మందు వాడాలి. చర్మవ్యాధులకు చివత్రాది లేపనాన్ని వాడవచ్చు. ఈ మొక్కను ఆన్ డ్రోగ్రాఫిస్ పానిక్యులేటా( బర్మన్ ఫిలియన్) వాలికి ఎక్స్వీస్ అని శాస్ర్తీయనామంగా పిలుస్తారు. మొక్క అకాన్థేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్కతో తిక్త కామృతం, గోరోచనాది గుళిక, చందనాసవం, పంచత్తిక కాషాయం వంటి ఆయుర్వేద మందులు తయారు చేస్తారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.