’తోటకూర‘ పోషక విలువల్లో రారాణి



మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఆకుకూరలో రాణి వంటిదని అంటారు. అలాగే పోషక విలువలు కలిగి ఉండడలో ఆకుకూరలకే రారాణి వంటిది. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, కొయ్యితోటకూర, వంటి పలు రకాలు ఉన్నాయి. ఆకు కూరలలో పీచు పదార్థంతో ఐరన్, పలు రకాల పోషక విలువలు నిండి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుంది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటి రాకుండ కాపాడుతుంది.

రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఆకుకూరను భుజించడం ఉత్తమం. పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది. తోటకూర తక్షణశక్తినివ్వడంలో తోడ్పడుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి.

తోటకూరలోని 'విటమిన్‌ సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది. విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే.. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది.

తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.

కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి. విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి.

వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.